Top News

Kasula in SIR | ఓటు హక్కు అత్యంత విలువైనది: బాలరాజ్

ఎస్ఐఆర్ లో పాల్గొన్న ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్  

ఓటు హక్కు అత్యంత విలువైనది: బాలరాజ్  

అర్హులంతా ఓటరుగా నమోదు కావాలని పిలుపు  

తెలంగాణ డైలీ న్యూస్ / బాన్సువాడ: ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని తన స్వగృహంలో నిర్వహించిన ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ శుక్రవారం పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా తన వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసి, నమోదు చేసిన దరఖాస్తు పత్రాలను బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డికి అందజేశారు.  

అనంతరం కాసుల బాలరాజ్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తమ వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.  

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని, ప్రతి అర్హుడైన ఓటరు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఎలాంటి అపోహలు, దుర్వినియోగానికి తావు ఇవ్వకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దగ్గరుండి ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.  

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, నార్ల రవీందర్, కౌన్సిలర్ ఖలేఖ్, కొట్టం గంగాధర్, మన్సూర్, బోడ భాస్కర్, శంకర్, ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.



Post a Comment

أحدث أقدم