Top News

SIR Observers | ఎస్ఐఆర్ పర్యవేక్షణకు టీపీసీసీ కమిటీ నియామకం

ఎస్ఐఆర్ పర్యవేక్షణకు టీపీసీసీ కమిటీ నియామకం  

పార్లమెంట్ స్థానాల వారీగా ఇన్‌చార్జిల నియామకం  

బూత్ స్థాయి సమస్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం: పులిపాటి రాజేష్ కుమార్  

తెలంగాణ డైలీ న్యూస్/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎస్ఐఆర్ కమిటీని నియమించారు.  

ఎలక్షన్ కమిషన్‌తో అనుసంధానం కోసం టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్‌ను, కాంగ్రెస్ పార్టీ పరిపాలనాపరంగా గంప వేణుగోపాల్‌ను నియమించినట్లు వెల్లడించారు.  

 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను నియమించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

1. అదిలాబాద్: కోల్కొండ సంతోష్  

2. పెద్దపల్లి: శశి భూషణ్ కాచే  

3. కరీంనగర్: డాక్టర్ మద్దెల సంతోష్ కుమార్  

4. నిజామాబాద్: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి  

5. జహీరాబాద్: డాక్టర్ జూలూరు ధనలక్ష్మి  

6. మెదక్: జీవీ వెన్నెల  

7. మల్కాజిగిరి: సుబ్రహ్మణ్య పొన్నాడ  

8. సికింద్రాబాద్: ఎం రాఘవేంద్ర రెడ్డి  

9. హైదరాబాద్: అచ్యుత యాదవ్  

10. చేవెళ్ల: ఎస్ జగదీశ్వర్ రావు  

11. మహబూబ్‌నగర్: టి రేవతి గౌడ్  

12. నాగర్ కర్నూల్: ఒబేదుల్లా కోత్వాల్  

13. నల్గొండ: కస్బా శ్రీనివాసరావు  

14. భువనగిరి: డాక్టర్ బైకినీ లింగం యాదవ్  

15. వరంగల్: పీర్ ఇర్షద్ అహ్మద్ నాసిర్  

16. మహబూబాబాద్: నూతి శ్రీకాంత్ గౌడ్  

17. ఖమ్మం: గోపిశెట్టి రాఘవేందర్  

ఈ కమిటీ సభ్యులు ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి బీఎల్ఏల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ నాయకులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారని టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Post a Comment

أحدث أقدم