విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు
తెలంగాణ సిద్ధాంతకర్త ఆశయాల సాధనకు కృషి చేయాలి: నేతలు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు.
తెలంగాణ భాష, సంస్కృతి, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. జయశంకర్ సార్ కలలు కన్న బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆయన ఆశయాలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహ్మద్ ఏజాజ్, అలీముద్దీన్ బాబా కౌన్సిలర్లు హకీం, చంద్రశేఖర్, కాసుల రోహిత్,మాజీద్, మహ్మద్ గౌస్, మండల నాయకులు అఫ్రోజ్,రెంజర్ల సాయిలు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీఆరెస్ ఆధ్వర్యంలో......
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఆదివారం బీఆరెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నేత నార్ల రత్న కుమార్, షేక్ అక్బర్, బాడీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.





Post a Comment