Ex MLA Shinday Protest | నిలిచిన బురద నీళ్లలో కూర్చొని నిరసన తెలిపిన షిండే

వినూత్న నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే

బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ జాప్యంపై బీఆర్ఎస్ ఆందోళన

నిలిచిన బురద నీళ్లలో కూర్చొని నిరసన తెలిపిన నేతలు

తెలంగాణ డైలీ న్యూస్-కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వినూత్న రీతిలో నిరసనకు దిగారు.

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి చిన్నపాటి వర్షానికే మోకాలు లోతు నిలిచిన బురద నీళ్లలో కూర్చొని ఆయన ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిచ్కుంద అభివృద్ధి కుంటుపడుతోందని, అభివృద్ధి పనులు లేక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారని హనుమంత్ షిండే ఆరోపించారు.

రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా ప్రధాన రోడ్డు పనులు రూ. 12 కోట్లతో గత మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. కనీసం కాలినడకన వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉంది.

ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






బిచ్కుంద ప్రధాన రోడ్డు దుస్థితి ఇదిగో 👇




Post a Comment

Previous Post Next Post