వరంగల్ ఆర్జేడీగా పదోన్నతి పొందిన మదన్ మోహన్‌కు పీఆర్టీయూ అభినందనలు
పలు డిమాండ్లతో వినతి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మొదటి విద్యా శాఖ అధికారిగా పనిచేసిన మదన్ మోహన్ వరంగల్ ఆర్జేడీగా పదోన్నతి పొందిన సందర్భంగా పీఆర్టీయూ జిల్లా నేత అంబీర్ మనోహర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అంబీర్ మనోహర్ రావు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్జేడీ మదన్ మోహన్‌కు అందజేశారు. టెట్‌ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను అమలు చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని, పీఆర్సీని తొందరగా అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు.
పీఆర్టీయూ తెలంగాణ విద్యార్థుల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సర్వ శిక్షా అభియాన్ పి వి శ్రీహరి కూడా ఉన్నారు

إرسال تعليق