కామారెడ్డి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం: 3 శాండ్ రీచ్‌లకు అనుమతులు
అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 4: జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.
3 శాండ్ రీచ్‌లకు పచ్చజెండా
ఈ సమావేశంలో ముఖ్యంగా 3 శాండ్ రీచ్‌ల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. అవి:
1. కిష్టాపూర్ (గ్రా), బీర్కూర్ మండలం
2. హస్గుల్ , బిచ్కుంద మండలం
3. కుర్లా గ్రామం, డోంగ్లీ మండలం
ఈ శాండ్ రీచ్‌లకు గనులు, పర్యావరణ అనుమతులు లభించాయని సహాయ సంచాలకులు, గనులు, భూగర్భ శాఖ నాగేష్ కమిటీకి తెలిపారు.
స్థానిక అవసరాలకే ప్రాధాన్యం
ఈ 3 రీచుల నుండి వచ్చే ఇసుకను ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పనులకు, జిల్లా స్థానిక అవసరాల కోసమే వాడుకోవాలని, స్థానిక గృహ నిర్మాణాలకు మాత్రమే ఇవ్వాలని కమిటీ ఆమోదం తెలిపింది. ఆయా మండలాల తహసీల్దార్లు వీటికి అనుమతి ఇచ్చేందుకు కమిటీ తీర్మానించింది.
కలెక్టర్ కీలక సూచనలు
"ఇసుక మన జిల్లా వాసుల హక్కు. బయట వారికి అమ్మితే మనకు ఇసుక కష్టాలు తప్పవు. ఇసుక కావాల్సిన వారు మన జిల్లా వాసులే ఉండాలి. మన ఇసుక వాహనం ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చు" అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
అక్రమ రవాణాపై ఉక్కుపాదం
జిల్లాలో ఎలాంటి అక్రమ ఇసుక రవాణా లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ఏర్పాటు చేసిన 4 చెక్‌పోస్టులను నిరంతరాయంగా పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), విక్టర్, . ఓ. నాగేష్, జిల్లా సహాయ సంచాలకులు, గనులు, భూగర్భ శాఖ, ఇతర జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




إرسال تعليق