Top News

Felicitation | జామ మస్జీద్ కమిటీ నూతన అధ్యక్షుడికి నాయకుల సన్మానం

బాన్సువాడ జామ మస్జీద్ కమిటీ నూతన అధ్యక్షుడికి నాయకుల సన్మానం  

సయ్యద్ రిజ్వాన్ ఏకగ్రీవ ఎన్నిక

బాన్సువాడ: బాన్సువాడ (తంజీముల్ మసాజిద్) జామ మస్జీద్ కమిటీ నూతన అధ్యక్షులుగా సయ్యద్ రిజ్వాన్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. 

ఈ శుభ సందర్భంగా మైనారిటీ షాదీఖానా చైర్మన్ అబ్దుల్ వహాబ్, పట్టణ మైనారిటీ సెక్రెటరీ యం.డి. దావూద్, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ మాజీద్ కలిసి నూతన అధ్యక్షులు సయ్యద్ రిజ్వాన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

మస్జీద్ అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో నూతన కమిటీ చురుకుగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు యూసుఫ్, ఖయ్యుమ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم