Top News

Office's Inaguraration | ప్రజలకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యం : పోచారం

నూతన పోలీస్ కార్యాలయాలు, ఇతర భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం  

రూరల్ సీఐ, ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాలు, హెల్త్ ఔట్ పోస్ట్, రజక సంఘ భవనం ప్రారంభం

ప్రజలకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యం : పోచారం 

బాన్సువాడ, జూలై 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, డి సీ సీ బి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను, భవనాలను ప్రారంభించారు.

కార్యక్రమ వివరాలు:  

ఉదయం 9 గంటలకు బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోలీస్ హెల్త్ ఔట్ పోస్ట్, శాశ్వత సదరం క్యాంపును ప్రారంభించారు. దీనితో పోలీస్ సిబ్బందికి అక్కడికక్కడే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. దివ్యాంగులకు సర్టిఫికెట్లు, పెన్షన్ల కోసం శాశ్వత సదరం క్యాంపు ఉపయోగపడుతుంది.  అనంతరం బాన్సువాడలో నూతనంగా నిర్మించిన రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాన్ని  ఘనంగా ప్రారంభించారు.  అలాగే కొత్త బాన్సువాడలో రజక సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. సామాజిక సంక్షేమానికి, సంఘ సభ్యుల సమావేశాలకు ఈ భవనం ఉపయోగపడుతుంది.










ఈ సందర్బంగా జరిగిన సభలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కార్యాలయాల ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. బాన్సువాడ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మన నియోజకవర్గంలో ప్రభుత్వ భవనాలు నిర్మించాము. సిద్దపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చేసాము. ఎక్కడైతే శాంతియుత వాతావరణం ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. త్వరలో బాన్సువాడలో డి ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తాము. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చాము. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని తెలిపారు.

టిజి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  ఈ వయసులో కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. పట్టనంలోని తాడ్కోల్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా వద్దా హెల్మెట్ లేకుండా  రోడ్డుపై హెల్మెట్ లేకుండా వస్తే ఫైన్లు వేస్తున్నారు. కొయ్యగుట్ట,  బీర్కూర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పెట్టి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి ఫైన్లు వేయాలని సూచించారు.



జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. డయల్ 100 ద్వారా ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలు కాపాడాము. బాన్సువాడలో పోలీస్ శాఖకు కొత్త భవనాలు రావడం అభినందనీయం. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  ఆర్.డి.ఓ రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, కౌన్సిలర్ ఖలేఖ్ ఎజాజ్, వాహబ్, గౌస్ తదితర ఉన్నత అధికారులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم