Top News

Girl Kidnap | మద్నూర్‌లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం

మద్నూర్‌లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం  

ఆర్థిక వివాదమే కారణమా?

దెగ్లూర్‌లో పోలీసుల తనిఖీలు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ :

మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఓ మైనర్ బాలిక కిడ్నాప్‌కు గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తడిహిపర్గాకు చెందిన ఓ వ్యక్తి ఆర్థిక లావాదేవీల్లో తేడాల కారణంగా బాలికను కిడ్నాప్ చేసి మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.సంఘటన జరిగిన వెంటనే బాలిక తల్లిదండ్రులు మద్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

దెగ్లూర్‌లో విస్తృత గాలింపు  

బాన్సువాడ డీఎస్పీ, బిచ్కుంద సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బాన్సువాడ డీఎస్పీ స్వయంగా దెగ్లూర్‌కు వెళ్లి కిడ్నాపర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి పోలీసు బలగాలు దెగ్లూర్ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఇంకా బాలిక ఆచూకి లభించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

أحدث أقدم