ఎస్ఐఆర్‌లో ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపాల్సిందే
ప్రజలకు మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి
గతంలో ఓటు వేసినా ఫామ్ తప్పనిసరి
24వ తేదీలోగా ఫామ్స్ సమర్పించాలి
(తెలంగాణ డైలీ న్యూస్ సిద్దిపేట బ్యూరో దాస శ్రీనివాస్)
ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు.
గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా ఎన్యుమరేషన్ ఫామ్ నింపి బీఎల్ఓకు అందజేశారు.(వీడియో 👇)
అపోహలు వద్దు - ఫామ్ నింపడమే ముఖ్యం
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ గతంలో మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశాం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఫామ్ నింపాల్సిన అవసరం లేదని భావించవద్దని స్పష్టం చేశారు. గతంలో ఓటు వేసినా సరే, ఇప్పుడు ఈ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇస్తేనే మీ ఓటు హక్కు జాబితాలో భద్రంగా ఉంటుందని తెలిపారు.
బీఎల్ఓ, బీఎల్ఏ లకు సహకరించాలి
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్క పౌరుడు విధిగా భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజలందరూ తమ ఇళ్ల వద్దకు వచ్చే బీఎల్ఓ, బీఎల్ఏ లకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపి, ఈ నెల 24వ తేదీలోగా సంబంధిత అధికారులకు అందజేయాలని హరీశ్ రావు కోరారు.

إرسال تعليق