కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో ఘటన
బాన్సువాడ, జూలై 12: కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... సోమేశ్వర్ గ్రామానికి చెందిన చల్ల సాయిలు, తండ్రి పేరు గురువయ్య, వయసు 55 సంవత్సరాలు, కులం వడ్డెర, వృత్తి కూలి. మొదటి భార్య చనిపోవడంతో సుమారు 20 సంవత్సరాల క్రితం రెండవ వివాహం చేసుకున్నారు. పెళ్లైనప్పటి నుండి భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండేవారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ విషయంలో మనస్తాపం చెందిన సాయిలు 11న రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రపోయిన తర్వాత తన గదిలో ఇంటి దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని మొదటి భార్య కుమారుడు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

إرسال تعليق