Top News

Umra Piligrim | ఉమ్రా యాత్రకు వెళ్తున్న ఇద్దరికి బాన్సువాడలో ఘన సన్మానం

ఉమ్రా యాత్రకు వెళ్తున్న ఇద్దరికి బాన్సువాడలో ఘన సన్మానం  

మక్కా షరీఫ్ లో ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించాలని కోరిన స్నేహితులు 

 తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూలై 12: సౌదీ అరేబియాలోని మక్కా షరీఫ్ కు ఉమ్రా యాత్ర నిమిత్తం బాన్సువాడ నుంచి వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ వసీ, అమీన్ పటేల్ లను వారి స్నేహితులు ఆదివారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర ఉమ్రా యాత్రలో బాన్సువాడ ప్రాంత అభివృద్ధికి, ప్రజలందరి సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. యాత్ర సుఖంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాగ్వాన్ అధ్యక్షుడు  కాజీం, అలీం యాహియా, అజాజ్, షఫీ, రియాజ్, బడే అమీన్, రాజీ, జహీం, అమీర్, ఆఫ్రిది, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم