తిరుమలలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ దర్శనం
రాష్ట్రం సుభిక్షంగా, పంటలు పండాలని స్వామివారిని ప్రార్థన
ప్రత్యేక పూజలు, టీటీడీ అధికారుల సత్కారం
తిరుపతి, తెలంగాణ డైలీ న్యూస్:
కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మొక్కు తీర్చుకునేందుకు సతీమణి పుష్ప, కుమారుడు డా. రవీందర్ రెడ్డి, కోడలు డా. రాధిక దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోని రెడ్డి దంపతులు, మనవరాళ్లు, మనుమలతో కలిసి ప్రత్యేక దర్శనంలో పాల్గొన్నారు. (వీడియో 👇)
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు సంతోషంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం టీటీడీ ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి సత్కరించారు.




إرسال تعليق