Top News

PBR in Somalingeshwara Temple | దుర్కి సోమలింగేశ్వర ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు

దుర్కి సోమలింగేశ్వర ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు

 స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన పోచారం భాస్కర్ రెడ్డి

తెలంగాణ డైలీ న్యూస్, నసరుల్లాబాద్ :

నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మాజీ డీసీసీబీ చైర్మన్  పోచారం భాస్కర్ రెడ్డి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సుఖసంతోషాల కోసం, పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నారు.

ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. "హర హర మహాదేవ" నామస్మరణలతో, శివభజనలతో వాతావరణం భక్తిమయంగా మారింది. భక్తులు స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ, నసురుల్లాబాద్ మండలాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు.







Post a Comment

أحدث أقدم