బాన్సువాడ మర్కజ్ మసీదు నూతన అధ్యక్షుడు రిజ్వాన్ కు ఘన సన్మానం
పాల్గొన్న కౌన్సిలర్లు, స్థానిక నాయకులు
బాన్సువాడ, జూలై 13: బాన్సువాడ మర్కజ్ మసీదు కు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రిజ్వాన్ కు స్థానిక నాయకులు, కౌన్సిలర్లు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఖలీక్, నంద కిషోర్, కోఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్, అలీ, సుభాన్, అద్నాన్ పాల్గొని రిజ్వాన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ మసీదు అభివృద్ధి, సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలిపారు.


إرسال تعليق