SIR in Borlam | బోర్లం గ్రామంలో SIR ఓటరు నమోదు

బోర్లం గ్రామంలో SIR ఓటరు నమోదు కార్యక్రమం  

కాంగ్రెస్ నాయకులు, BLOలు క్షేత్రస్థాయిలో పరిశీలన

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ : బోర్లం గ్రామంలో నేడు SIR (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా బూత్ నెంబర్ 214లో కుటుంబ సభ్యుల ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మండల నాయకులు పట్లోళ్ల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. BLO కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, బోర్లం GPO రవీందర్, మరో BLO అశోక్ కుమార్, బోర్లం సెక్రటరీ శివాజీతో కలిసి ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలతో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ

బోర్లం బూత్ పరిధిలో ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు సేకరించడం, ఎన్యుమరేషన్ ఫారం నింపే ప్రక్రియను నాయకులు స్వయంగా పరిశీలించారు. ఓటరు నమోదులో ఎలాంటి లోపాలు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదయ్యేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు షేక్ మహబూబ్, మాజీ వార్డు సభ్యులు హర్షత్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బి.సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم