Dist Collector | జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మే 31 వరకు పొడిగింపు


•జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మే 31 వరకు పొడిగింపు

•జిల్లా అక్రీడిటేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్

తెలంగాణ డైలీ న్యూస్,కామారెడ్డి: జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం జారీ చేసిన 252 జీవో మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఈ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరగాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా అక్రిడిటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఏప్రిల్ 30తో ముగియనున్న అక్రిడిటేషన్ కాలపరిమితిని మే 31 వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.

ఈ సమావేశంలో డీపీఆర్వో, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post