Banswada Sub Collector | బదిలీపై వెళ్తున్న IAS అధికారిణి కిరణ్మయి కొప్పిశెట్టికి ఘన వీడ్కోలు


•బదిలీపై వెళ్తున్న IAS అధికారిణి డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి ఘన వీడ్కోలు

•జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

•బాన్సువాడ ప్రజలు అందించిన సహకారం మరువలేనిది: కిరణ్మయి

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

బదిలీపై వెళ్తున్న బాన్సువాడ సబ్ కలెక్టర్, IAS అధికారిణి  డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి బుధవారం IDOC కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా యంత్రాంగం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, డాక్టర్ కిరణ్మయి  జిల్లాలో పనిచేసిన కాలంలో నిబద్ధత, అంకితభావంతో సేవలందించి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఆమె తీసుకున్న చొరవ జిల్లా అభివృద్ధికి దోహదపడిందన్నారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని సత్వర పరిష్కారానికి కృషి చేయడం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేయడం ఆమె ప్రత్యేకత అని కలెక్టర్ పేర్కొన్నారు. యువ అధికారులకు ఆమె పనితీరు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.



ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి మాట్లాడుతూ, ఇది తనకు శిక్షణ కాలమని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్  మార్గదర్శకత్వంలో అనేక అంశాలు నేర్చుకున్నానని తెలిపారు. కలెక్టర్ గారి సలహాలు, సూచనలు, ప్రోత్సాహం తన వృత్తి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు.

జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ముఖ్యంగా బాన్సువాడ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మదు మోహన్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని డాక్టర్ కిరణ్మయి గారిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.



Post a Comment

Previous Post Next Post