ACB Raid | ఎక్సైజ్ సిఐ నివాసంలో తనిఖీలు

 

భారీ డబ్బులతో ఏసీబి కి చిక్కిన సి ఐ

ఏసిబి దాడులతో బిచ్కుంద లో కలకలం

అస్వస్థతకు గురైన సి ఐ

భారీ మొత్తం లో నగదు లభ్యం?

(వీడియో 👆👆)

తెలంగాణ డైలీ న్యూస్, బిచ్కుంద:

అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ ఇంట్లో సి ఐ అద్దెకు ఉంటున్నారు. ఆయన నివాసంలోనే *ACB సోదాలు* చేయడం కలకలం రేపింది. నిజామాబాద్ రేంజ్ ACB అధికారులు శుక్రవారం ఉదయం సిఐ నివాసంలో తనిఖీలు మొదలుపెట్టారు. తనిఖీలు జరుగుతుండగా సిఐ సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు.  

"కల్లు దుకాణాలను నడుపుకోండి"

"కేసులు పెట్టను"

"ఈ సహకారానికి రూ. 2 లక్షలు

శుక్రవారం నాడు ఎక్సైజ్ సీఐ బిచ్కుందలోని తన అద్దె ఇంట్లో రూ. 2,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ACB అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారునికి అధికారిక సహాయం చేస్తానని, గ్రామాల్లోని కల్లు దుకాణాలను షిఫ్ట్ చేయమని ఒత్తిడి చేయను అని, "ఇంకా కేసులు పెట్టను, కల్లు దుకాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుపుకోనిస్తాను" అని చెప్పి డబ్బు డిమాండ్ చేశారు. అయన  బ్యాగ్‌లో లెక్కల్లో చూపని రూ. 45,760 నగదు కూడా దొరికింది.

ACB చర్యలు: 

 ఏసిబి అధికారులు ఎక్సైజ్ సి ఐని అరెస్ట్ చేశారు.హైదరాబాద్ నాంపల్లిలోని *II Additional Special Judge for SPE & ACB Cases* కోర్టులో హాజరుపరుస్తున్నారు.కేసు దర్యాప్తులో ఉంది.





Post a Comment

Previous Post Next Post