Thanks to Shabbir Ali | షబ్బీర్ అలీకి ధన్యవాదాలు


టీ యూ అభివృద్ధికి కృషి చేయాలి 

బాధ్యతా యుతంగా పని చేయాలి

ఘాజీ కి  షబ్బీర్ అలీ హితువు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

మొహమ్మద్ ఘాజీకి తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి  సభ్యునిగా నియమించిన సందర్బంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను హైదరాబాద్ లో కలిసి  కృతజ్ఞతలు తెలిపారు.

తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించేందుకు సహకరించిన షబ్బీర్ అలీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

ఈ అవకాశం తనకు గొప్ప బాధ్యతగా భావిస్తూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  ఘాజీని అభినందిస్తూ, ఆయనకు ఆశీస్సులు అందించారు. 

తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, NSUI జిల్లా అధ్యక్షులు ఐరేణి సందీప్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post