తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం మార్గదర్శకమని పేర్కొన్నారు. మన ఆశయాలనుఅనే సమాజంలో ముందుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఆయన చూపిన మార్గంలోనే సమాజ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డాకూరి మోహన్, తెడ్డు సాయిలు, పట్నం నర్సింలు, హరీష్ ( చిన్న ), సుంకరి సంజీవులు, శ్రీకాంత్, సాయిబాబా, రాజు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
Post a Comment