Youth Congress | యూఎస్ ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష

 

దీక్షను విరమిస్తున్న దృశ్యం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దీక్ష

విరమింపజేసిన మున్సిపల్ చైర్ పర్సన్

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూఎస్ ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు.


నాయకులు మాట్లాడుతూ యూఎస్ ట్రేడ్ డీల్ వల్ల దేశీయ రైతులు, వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల విదేశీ కంపెనీలకు అధిక ప్రాధాన్యం లభించి, స్థానిక ఉత్పత్తులు మరియు రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

అలాగే, ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, యూఎస్ ట్రేడ్ డీల్‌ను వెంటనే పునర్విమర్శించాలని డిమాండ్ చేశారు.


ఈ సత్యాగ్రహ దీక్షలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి జాతీయ యువజన కార్యదర్శి రోషిణి జైస్వాల్,కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్  ఉమారాణి  విచ్చేసి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు గొడుగుల శ్రీనివాస్, సర్ధార్, ఇమ్రోజ్ NSUI అధ్యక్షులు సందీప్ జిల్లా కార్యదర్శులు అజ్మాత్, అన్వేష్ ,కౌన్సిలర్స్ మజీద్, అంజాద్, సత్యం, గణేష్, బబ్లు, లడ్డు, సిద్దిక్, జావీద్, వివిధ రాజకీయ పార్టీలు ,రైతు సంఘాలు తదితరులు పాల్గొనడం జరిగింది.



Post a Comment

Previous Post Next Post