Addl Collector | రోజుకు కనీసం 12 లారీల ధాన్యం అన్‌లోడ్ చేయాలి: అదనపు కలెక్టర్ విక్టర్


రోజుకు కనీసం 12 లారీల ధాన్యం అన్‌లోడ్ చేయాలి: అదనపు కలెక్టర్ విక్టర్

మాచారెడ్డి పీపీసీ కేంద్రం, భిక్కనూర్ మిల్లును పరిశీలించిన అదనపు కలెక్టర్ 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, మే 24: ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను, మిల్లర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన మాచారెడ్డి మండలంలో పర్యటించారు.  

చుక్కాపూర్, లచ్చాపేట గ్రామాల సందర్శన  

అదనపు కలెక్టర్ విక్టర్ ఆదివారం మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, లచ్చాపేట గ్రామాలను సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  

పీపీసీ కేంద్రం పరిశీలన  

అనంతరం మాచారెడ్డి గ్రామంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీపీసీ కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి (డీసీవో)తో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.  

మిల్లర్లకు కీలక ఆదేశాలు 

తదుపరి భిక్కనూర్‌లోని సప్తగిరి పీబీఆర్ ఇండస్ట్రీస్‌ను సందర్శించి మిల్లర్‌తో మాట్లాడారు. ఎలాంటి ఆలస్యం లేకుండా రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అన్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు పెరగకుండా మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.  ఈ సందర్శనలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, ట్యాబ్ ఎంట్రీ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్‌లో మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లకు సంబంధించి అవసరమైన నిల్వ స్థలాల లభ్యత, కొనుగోలు కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ధాన్యం త్వరితగతిన తరలింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మొక్కజొన్న, జొన్నల కొనుగోలు ప్రక్రియను కూడా నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పూర్తిస్థాయిలో అందేలా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Post a Comment

أحدث أقدم