Banswada Municipality | కో-ఆప్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరిరోజు

•బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరిరోజు

•ఇప్పటికే ఆరు దరఖాస్తులు

•కాంగ్రెస్ లో నలుగురి పేర్లు ఫైనల్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ పురపాలక సంఘంలో నలుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు. ఇప్పటివరకు ఆరు దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం ఎంపిక ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. నాలుగు పోస్టులను కాంగ్రెస్ పార్టీ యే దక్కించుకునే అవకాశలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకున్నవారిలో మాజీ వార్డు సభ్యులు ఉల్లవ్వ, కుర్ర సరిత, నర్సగొండ, సలీం, సుగుణ, రాజాసింగ్‌లు ఉన్నారు. అయితే వీరిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు మాజీ సభ్యులు నాయకుల సూచనతో విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిసింది. మరొకరు బిజెపి కి చెందినవారు.

కో-ఆప్షన్ సభ్యుల ఎంపికపై ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌లు చర్చించారు. అధికార పార్టీ ఇప్పటికే ఇద్దరు మైనారిటీ వర్గాల నుంచి, ఇద్దరు మున్సిపల్ అనుభవం ఉన్నవారిని ఎంపిక చేశారు.

మైనారిటీ కోటాలో టీచర్స్ కాలనీకి చెందిన గౌస్ భార్య, కోటగల్లికి చెందిన మాజీద్, అనుభవం కోటాలో మాజీ కౌన్సిలర్ కాసుల రోహిత్, మహిళా నాయకురాలు ప్రతిమారెడ్డిలను ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో అనేక మంది కో అప్షన్ పోస్ట్ కోసం ప్రయత్నించినా, ఇద్దరు అగ్ర నేతలు ఆచి తూచి సభ్యులను ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే పార్టీ కోసం కష్టపడ్డ నాయకులను పక్కన పెట్టి మైనార్టీల్లో కొత్త వారిని ఎంపిక చేయడం పట్ల ఆశవహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాగా బాన్సువాడ మున్సిపాలిటీలో మొత్తం 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు 11, బీఆర్ఎస్‌కు 3, బీజేపీకి 3, ఎంఐఎంకు 1, ఇండిపెండెంట్ 1 ఉన్నారు. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ బలం 12కు చేరింది. కో-ఆప్షన్ సభ్యులు కూడా కాంగ్రెస్‌కే దక్కితే ఆ సంఖ్య 16కు చేరుతుంది.

జీవో 57, 58 ప్రకారం ఇద్దరు సభ్యులను అనుభవం కోటాలో, ఇద్దరిని మైనారిటీ కోటాలో ఎంపిక చేయాలి. ప్రతి కేటగిరీలో ఒకరు మహిళ తప్పనిసరి. దరఖాస్తులు మే 1 సాయంత్రం 5 గంటలలోపు మున్సిపల్ కమిషనర్‌కు సమర్పించాల్సి ఉంది.

Post a Comment

Previous Post Next Post