BNS Muncipal Council | కోఆప్షన్‌కు కాంగ్రెస్ నుంచి నలుగురు దరఖాస్తు


బాన్సువాడ మున్సిపాలిటీ కోఆప్షన్‌కు దరఖాస్తు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు కాసుల రోహిత్, మొహమ్మద్ మజీద్, కొర్ల ప్రతిమ నరేష్ రెడ్డి, కమర్ సుల్తానా గౌస్. చిత్రంలో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, జంగం గంగాధర్ తదితర నాయకులు.

బాన్సువాడ మున్సిపాలిటీ కోఆప్షన్‌కు కాంగ్రెస్ నుంచి నలుగురు దరఖాస్తు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నిక దరఖాస్తు చివరి రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

కాసుల రోహిత్, మొహమ్మద్ మజీద్ ముజ్జు, కొర్ల ప్రతిమ నరేష్ రెడ్డి, కమర్ సుల్తానా గౌస్‌లు కోఆప్షన్ సభ్యత్వానికి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా ప్రతిమా రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహారించుకొగా, ఉల్లవ్వ నామినేషన్ ను అధికారులు పరిగణలోకి తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల రవీందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురు వినయ్ కుమార్ స్వామి, తాడ్కోల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, మాజీ కౌన్సిలర్ నార్ల నందకిషోర్, మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ కాలేక్, హకీమ్, రమేష్ కాటికే, జంగం రాజు, నాగేష్, రుక్మిణి, మాజీ వార్డు సభ్యులు సలీం, కొత్త అశోక్ తదితరులు పాల్గొన్నారు.  కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని పార్టీ నాయకులు తెలిపారు.


Post a Comment

Previous Post Next Post