•కామారెడ్డిలో ఘనంగా మే డే ఉత్సవాలు
•"సమాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం" - కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
•పలువురికి అవార్డుల ప్రదానం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ఉత్సవాలు శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, షుగర్కేన్ చైర్మన్ ఇర్షాద్ ఉద్దీన్, అదనపు కలెక్టర్ మధుమోహన్, సహాయక కార్మిక కమిషనర్ డా. మున్నం శశికుమార్ పాల్గొన్నారు.
వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ తాడ్వాయి విద్యార్థులు, జిల్లా కళాబృందం సభ్యులు, పారిశ్రామిక వేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అవార్డుల ప్రదానం:
జిల్లా స్థాయి కమిటీ ఎంపిక చేసిన కార్మిక దినోత్సవ అవార్డులను కలెక్టర్ అందజేశారు.
ఉత్తమ పరిశ్రమ: బేసిస్ లాబొరేటరీస్
ఉత్తమ ఉద్యోగులు: సయీద్ కమ్రుద్దిన్ - కార్మిక శాఖ, శ్రీమతి కృప - ఉపాధి శాఖ, రమేష్ - ATC తాడ్వాయి
ప్రత్యేక సత్కారం: ATC తాడ్వాయి ప్రిన్సిపాల్
సన్మానం: అబ్దుల్ రజాక్ (భవన నిర్మాణ కార్మికుల సంఘం)
వివిధ కార్మిక సంఘాల నాయకులను కూడా ఘనంగా సన్మానించారు.
కలెక్టర్ సందేశం:
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, ప్రతి రంగం పురోగతికి కార్మికుల కృషే పునాది అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్మికులు తమ హక్కులతో పాటు విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


Post a Comment