MLA PSR in Pro Kabaddi | క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం : పోచారం


•క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం 

•గ్రామీణ క్రీడాకారుల కోసమే స్టేడియం: పోచారం

•బాన్సువాడలో ప్రో-కబడ్డీ సీజన్-1 కామారెడ్డి ప్రీమియర్ లీగ్ ఘనంగా ముగింపు

•విజేతలకు బహుమతుల ప్రదానం

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం ప్రయత్నించాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సీనియర్ కబడ్డీ క్రీడాకారుల ఆధ్వర్యంలో కెపిఎల్ కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను కో-ఆప్షన్ మెంబర్ సిహెచ్ రాజు, మహ్మద్గౌ గౌస్ ఆర్గనైజ్ చేశారు.  

ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్ రాజు, వార్డు కౌన్సిల్ మెంబర్లు, సీఐ శ్రీధర్, కాంగ్రెస్ నేత పి శంభూరెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాజ్  హాజరయ్యారు.  

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే బాన్సువాడలో మినీ స్టేడియం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ స్టేడియం వల్ల క్రీడాకారులకు మంచి వేదిక లభించిందని తెలిపారు. అన్ని రకాల క్రీడలను ఇక్కడ ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గెలుపొంది బాన్సువాడకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 

మొదటి బహుమతి సాధించిన టీమ్


విజేతల వివరాలు:

బాలుర విభాగం:

1. మొదటి స్థానం: కామారెడ్డి క్లబ్  

2. రెండవ స్థానం: తాడ్వాయి  

3. మూడవ స్థానం: బొల్లారం  

4. నాల్గవ స్థానం: బాన్సువాడ బాయ్స్  

బాలికల విభాగం:

1. మొదటి స్థానం: బాన్సువాడ  

2. రెండవ స్థానం: తాడ్కోల్  

3. మూడవ స్థానం: నిజామాబాద్  

4. నాల్గవ స్థానం: బాన్సువాడ  

ప్రో-కబడ్డీ సీజన్-1 కామారెడ్డి ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు బాన్సువాడలో మే 17, 2026న విజయవంతంగా ముగిశాయి. విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. కబడ్డీ క్రీడాభివృద్ధికి ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని అతిథులు అభిప్రాయపడ్డారు. 

టోర్నమెంట్ వివరాలు:

సీనియర్ కబడ్డీ క్రీడాకారుల ఆధ్వర్యంలో బాన్సువాడ, కామారెడ్డి జిల్లాలో ప్రో కబడ్డీ సీజన్ వన్ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించారు.  

బహుమతుల వివరాలు:  

1. మొదటి బహుమతి: 15000 రూపాయలు + ట్రోఫీ  

2. రెండవ బహుమతి: 10000 రూపాయలు + ట్రోఫీ  

3. మూడవ బహుమతి: 5000 రూపాయలు + ట్రోఫీ  

4. నాల్గవ బహుమతి: 2500 రూపాయలు + ట్రోఫీ  

ప్రత్యేక బహుమతులు:బెస్ట్ రైడర్, బెస్ట్ డిఫెండర్, ఆల్ రౌండర్ బహుమతులు అందజేశారు.  









Post a Comment

أحدث أقدم