Top News

Missing Case | షాపింగ్‌కు వెళ్లి భార్య, ముగ్గురు పిల్లలు మిస్సింగ్

షాపింగ్‌కు వెళ్లి భార్య, ముగ్గురు పిల్లలు మిస్సింగ్  

కామారెడ్డి పోలీసులకు భర్త ఫిర్యాదు 

బావమరిది ఇంటి నుంచి బయలుదేరి కనిపించకుండా పోయారు  

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

తెలంగాణ డైలీ న్యూస్ కామారెడ్డి, జూన్ 11: కామారెడ్డి పట్టణంలో షాపింగ్‌కు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లకుండా భార్య, ముగ్గురు పిల్లలు మిస్ అయ్యారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సి ఐ నరహరి తెలిపారు.

ఫిర్యాదు వివరాలు

రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యాడారం భాను ప్రకాష్ అనే వ్యక్తి కామారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తన భార్య లయ అలియాస్ శ్యామల (31), కూతురు బిందు (17), మరో కూతురు దిబిజా (8), కొడుకు శివ (13) నిన్న కామారెడ్డి పట్టణానికి షాపింగ్ నిమిత్తం వచ్చినట్లు తెలిపాడు.  

ఆటోలో వెళ్లి కనిపించకుండా పోయారు 

మధ్యాహ్నం 12 గంటలకు తన బావమరిది ఇంటికి వెళ్లి లంచ్ చేసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వెళుతున్నామని చెప్పి ఆటోలో బయలుదేరారని పేర్కొన్నాడు. రాత్రి 8 గంటల బస్సుకు ఇంటికి వస్తానని భార్య చెప్పిందని, కానీ ఇంటికి చేరుకోలేదని ఫిర్యాదులో వివరించాడు.  

భార్య, ముగ్గురు పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన భాను ప్రకాష్ పోలీసులను ఆశ్రయించాడు. దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కామారెడ్డి పోలీసులు తెలిపారు.

Post a Comment

أحدث أقدم