BJP Protest in Banswada | సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్‌ను ఖండిస్తూ బాన్సువాడలో రాస్తారోకో, ధర్నా  

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం  

"కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కింది" - ఎండల లక్ష్మీనారాయణ

బాన్సువాడ: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తున్న సమయంలో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం బాన్సువాడలో బిజెపి ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు.

బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి ఎండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

"ఇచ్చిన హామీలు తుంగలో" - ఎండల లక్ష్మీనారాయణ  

ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోను పక్కనపెట్టిందని విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాలరాస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు, డిలిమినేషన్ బిల్లు వంటివి అమలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హామీలను విస్మరించిందని ఆరోపించారు.

రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఆయన జోస్యం చెప్పారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు.

ఈ ధర్నాలో బిజెపి నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ, గుడుగుట్ల శ్రీనివాస్, కొనాల గంగారెడ్డి, శంకర్ గౌడ్, సాయిరాం, కులకర్ణి శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లి బిజెపి పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. (వీడియో 👇)





Post a Comment

أحدث أقدم