PBR BIRTH DAY CELEBRATIONS | "పేదల గుండెల్లో చిరునామా" - పోచారం భాస్కర్ రెడ్డి

"పేదల గుండెల్లో చిరునామా" - పోచారం భాస్కర్ రెడ్డి 

"నేనున్నాను" అనే మాటే మంత్రం - వేలాది కుటుంబాలకు ఆయనే ఆశాదీపం  

సేవే రాజకీయం అంటూ యువతకు ఆదర్శంగా నిలిచిన డైనమిక్ లీడర్

జన్మదిన వేడుకలతో  పులకించిన బాన్సువాడ

(తెలంగాణ డైలీ న్యూస్-బాన్సువాడ✍️)

నేడు బాన్సువాడ నియోజకవర్గంలో పండుగ వాతావరణం. కారణం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు  పోచారం శ్రీనివాస్ రెడ్డి  రాజకీయ వారసుడు, మాజీ డిసిసీబి చైర్మన్, యువ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి  జన్మదినం

ఉదయం నుంచే నియోజకవర్గంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామం జెండాలు, ఫ్లెక్సీలు, హార్డింగ్‌లతో కళకళలాడింది. అభిమానులు అన్నదానాలు, వస్త్ర పంపిణీ, రక్తదాన శిబిరాలు, పండ్లు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 "పేదల పాలిటి పెన్నిధి" - కష్టంలో తొలి అడుగు ఆయనదే

బాన్సువాడ నియోజకవర్గంలో "భాస్కర్ రెడ్డి అంటే ఆపదలో ఆదుకునే చేయి" అనే పేరుంది. 

నియోజకవర్గం నుంచి ఏ పేద కుటుంబమైనా హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ చికిత్స కోసం వెళ్తే, అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే చాలు - వెంటనే స్పందించి సొంత డబ్బులతో సహాయం అందించే గుణం ఆయన సొంతం. ఆసుపత్రిలో ఉన్న రోగుల దగ్గరికి స్వయంగా వెళ్లి, "ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటా" అని భరోసా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. గతంలో ప్రత్యేకంగా ఓ వ్యక్తిగత సహాయకుడిని నియమించి వైద్య సేవలు అందించారు.

పేద ఆడపడుచుల పెళ్లిళ్లకు అండగా నిలబడటం, నిరుపేదల ఇంటి కలను సాకారం చేయడం - ఇవి ఆయనకు రాజకీయం కాదు, బాధ్యత.



"యువతకు ఉపాధి దాత" - కోటి రూపాయల కల

నిరుద్యోగం యువతకు పెద్ద సమస్య అని గుర్తించిన భాస్కర్ రెడ్డి  మాటలతో ఆపకుండా, చేతలతో నిరూపించారు. 

నియోజకవర్గంలో 2 ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లను సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. దీని కోసం దాదాపు కోటి రూపాయల వరకు వెచ్చించారు. ఫలితంగా వేలాది మంది యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

అంతేకాదు. "మా యువకులు క్రీడల్లోనూ రాణించాలి" అనే ఆలోచనతో ప్రతి టోర్నమెంట్‌కు ఆయనే ప్రధాన అతిథి. "ఏ టోర్నమెంట్ అయినా నేనున్నాను" అని యువతకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహిస్తున్నారు.



 "అన్ని మతాలు - అన్ని వర్గాలు" - సమైక్యతకు చిహ్నం

తండ్రి  పోచారం శ్రీనివాస్ రెడ్డి  నుంచి నేర్చుకున్న ప్రజాసేవా పాఠాలను ఆయన అక్షరాలా పాటిస్తున్నారు. 

బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, అన్ని కులాలు, మతాల వారికి తేడా లేకుండా సహాయం అందిస్తున్నారు. అందుకే నియోజకవర్గ ప్రజలు ఆయనను "బాన్సువాడ ఆశాజ్యోతి" అని ప్రేమగా పిలుచుకుంటారు.


అభిమానుల మాటల్లో భాస్కర్ రెడ్డి

"ఆయన దగ్గరికి వెళ్తే ఖాళీ చేతులతో రాము. మా సమస్యను తన సమస్యలా చూస్తారు"  

"రాజకీయ నాయకుడు కాదు, మా ఇంటి పెద్ద కొడుకులా ఉంటారు"

ఈరోజు జన్మదినం సందర్భంగా వేలాది మంది అభిమానులు  తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని, శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉన్నత పదవి లభించాలని మొక్కులు చెల్లించుకున్నారు.

సంపాదకీయం: ఇలాంటి నాయకులే కావాలి✍️

నేటి రాజకీయాల్లో "సేవ" అనే మాట మరుగున పడుతున్న తరుణంలో పోచారం భాస్కర్ రెడ్డి  లాంటి యువ నాయకులు నిజంగా ఆదర్శం. పదవి కోసం కాకుండా, ప్రజల కోసం పనిచేసే తత్వం ఆయనలో కనిపిస్తుంది. 

"నేనున్నాను" అనే ఒకే మాటతో లక్షలాది మందికి ధైర్యం ఇస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గం భవిష్యత్తుకు ఆయనే నిజమైన ఆశాకిరణం.


Post a Comment

أحدث أقدم