Top News

Railway Accident | రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి  

గుర్తింపు పత్రాలు లేవు.. కుడిచేతిపై హనుమాన్ పచ్చబొట్టు

కామారెడ్డి, జూలై 12: అశోక్ నగర్ రైల్వే గేట్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. 

పోలీసుల వివరాల ప్రకారం... 12 జూలై 2026 రాత్రి 8:40 గంటల సమయంలో KM నెంబర్ 510/12-13 రైల్వే ట్రాక్ పై ఏదో గుర్తు తెలియని రైలు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

మృతుని వివరాలు  

మృతుని వయసు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎత్తు 5'4". ఒంటిపై గోధుమ రంగు షర్టు, బూడిద రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. కుడి చేతిపై హనుమంతుని బొమ్మతో పచ్చబొట్టు ఉంది. మృతుని వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లభించలేదు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీస్, కామారెడ్డిని ఈ కింది నెంబర్లలో సంప్రదించగలరు.  

ఫోన్:87 126 58 614, 99 51 32 93 65

Post a Comment

أحدث أقدم