Top News

Road Accident | రోడ్డు ప్రమాదంలో బీర్కూర్ యువకుడు మృతి

 


రోడ్డు ప్రమాదంలో బీర్కూర్  యువకుడు మృతి  

బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఘటన

గుమ్మడిదల వద్ద ఘటన 

సంగారెడ్డి, జూలై 12: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు.

పోలీసుల కథనం ప్రకారం... బీర్కూర్ గ్రామానికి చెందిన తాడి చెట్ల రవి, వయసు 18 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కన్స్ట్రక్షన్ పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి స్వగ్రామం బీర్కూర్‌కు బయలుదేరాడు.

మార్గమధ్యంలో గుమ్మడిదల వద్దకు రాగానే రవి నడుపుతున్న బైక్ అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న బైక్ రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, తల్లి సావిత్రి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కుటుంబంలో విషాదం 

ఏడాది కిందట రవి తండ్రి రాములు లారీ ప్రమాదంలో మృతి చెందారు. ఇప్పుడు కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బీర్కూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment

أحدث أقدم