ASP Transfer | కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి బదిలీ

 


👉సంగారెడ్డి కి బదిలీ అయిన ఏఎస్పీ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డిని సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  2025 జనవరి 1న మొట్టమొదటిసారిగా కామారెడ్డికి సబ్ డివిజన్ ఏఎస్పీ స్థాయి అధికారిణిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ డీఎస్పీలు మాత్రమే పనిచేసేవారు. దాదాపు 15 నెలల పాటు కామారెడ్డిలో పనిచేసి విధుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 

 👉చేసిన కీలక పనులు:  

- మహిళా అధికారిగా ఉండి, షీ టీం, పొక్సో కేసులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి జిల్లాలో శాంతిభద్రతలకు కృషి చేశారు.

   - కేసుల విచారణలో పారదర్శకత పెంచేలా చర్యలు తీసుకున్నారు.

   - షీ టీం బలోపేతం కోసం కృషి చేసి, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

   - పొక్సో కేసుల విచారణలో నిక్కచ్చిగా వ్యవహరించారు.

   - మహిళా సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

   - పొక్సో బాధితులతో నేరుగా మాట్లాడి భరోసా నింపే ప్రయత్నం చేశారు. దీంతో అనేక కేసులు నమోదై, నిందితులకు శిక్షలు కూడా పడ్డాయి.

   -తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చేయడంతో “ఏఎస్పీ వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుంది” అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు.

   - ఏఎస్పీ బదిలీ తర్వాత కొత్తగా ఎవరు వస్తారో ఇంకా తెలియలేదు.

  


Post a Comment

Previous Post Next Post