Lock to PACS | కామారెడ్డి జిల్లాలో రైతుల ఆందోళన

-బీర్కూర్ మండలం బైరపూర్‌లో వరి కొనుగోళ్లు నిలిపివేత 

- సొసైటీకి తాళం

తెలంగాణ డైలీ న్యూస్-బాన్సువాడ:

బీర్కూర్ మండలం బైరపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించిన రైతులు సొసైటీకి తాళం వేసి నిరసనకు దిగారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వరకు సొసైటీ ముందు నుంచి కదిలేది లేదంటూ బైఠాయించారు.

(భైరపూర్ లో సొసైటీ కి తాళం వేసి ఆందోళన చేస్తున్న రైతుల వీడియో 👆👆👆)

రైతుల ఆవేదన:

4వ తేదీ నుంచి సొసైటీ సెక్రటరీ కార్యాలయానికి రావడం లేదని రైతులు మండిపడ్డారు. "వర్షం వస్తే మా పంట పరిస్థితి ఏం కావాలి?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గ్రామం లో ధాన్యం కొనుగోళ్ల ను వెంటనే ప్రారంభించాలని, వర్షం పడితే ఎవరు బాధ్యులని, రైతుల సమస్య ను వెంటనే పరిష్కరించాలని మాజీ సర్పంచ్ బోడమీది హన్మండ్లు, బుద్ధి శ్రీనివాస్పో, తురాజు నాగప్ప డిమాండ్ చేశారు.

కొనుగోళ్లు ఆలస్యమైతే తడిసిన ధాన్యానికి మద్దతు ధర రాదని, రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తమవుతోంది.





Post a Comment

Previous Post Next Post