బాన్సువాడ ఆసుపత్రి కి రాష్ట్ర పురస్కారం

ఉత్తమ సేవలకు గుర్తింపు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆరోగ్య శాఖ సిబ్బందిని, ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రభుత్వ ఆసుపత్రి లో ఎక్కువ కాన్పులు నిర్వహించిన బాన్సువాడ ఆసుపత్రి ఉత్తమ ఆసుపత్రి గా ఎంపికైంది. రవీంద్ర భారతి లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రేపు రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు  దామోదర రాజ నరసింహ  చేతులమీదుగా  ఆసుపత్రి సూపరింటెండెంట్ DCHS డా. విజయ భాస్కర్ అవార్డు అందుకోనున్నారు.
 వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.అజయ్ కుమార్ ద్వారా  సమాచారాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ DCHS డా.విజయ భాస్కర్ అందుకున్నారు.
అవార్డు బాధ్యతను పెంచింది: డా. విజయ భాస్కర్
బాన్సువాడ ఆసుపత్రి కి రావడం చాలా సంతోషకరమని డా. విజయ భాస్కర్ తెలిపారు.ఆసుపత్రి లో పని చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కి ఈ అవార్డు అంకితమిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.bఆసుపత్రి పురోభవృదిలో అనునిత్యం తమ వెంట ఉండే పోచారం శ్రీనివాస్ రెడ్డి,కలెక్టర్, ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్. కిరణ్మయికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post