నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద తప్పిన పెను ప్రమాదం
నీటిలో గల్లంతైన యువకుడిని కాపాడిన మత్స్యకారుడు
నిజాంసాగర్, సెప్టెంబర్ 14: నిజాంసాగర్ ప్రాజెక్ట్ 12 గేట్ల వద్ద స్నానానికి దిగిన 18 ఏళ్ల యువకుడు నీటిలో గల్లంతై, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆదివారం ఈ సంఘటన జరిగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. వీడియో 👇
వివరాల్లోకి వెళితే.. బాన్సువాడ కోట్‌గల్లీకి చెందిన 18 ఏళ్ల ముజాకీర్ తన స్నేహితులు అమాన్, నాగార్జున్‌తో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను చూసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ 12 గేట్ల వద్ద ముజాకీర్ స్నానానికి దిగగా, ప్రవాహంలో కొట్టుకుపోయి నీటిలో గల్లంతయ్యాడు.
అదే సమయంలో చేపలు పట్టేందుకు అక్కడికి వచ్చిన మత్స్యకారుడు సయ్యద్ సయీద్ ఒద్దిన్ అప్రమత్తమై వెంటనే నీటిలోకి దూకి ముజాకీర్‌ను బయటకు తీసుకొచ్చాడు.
తీవ్రంగా నీళ్లు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ముజాకీర్‌కు స్థానికుల సహకారంతో సీపీఆర్ చేశారు. దీంతో అతడు కోలుకొని ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.
మత్స్యకారుడు సయ్యద్ సయీద్ ఒద్దిన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి యువకుడి ప్రాణాలను కాపాడటంతో స్థానికులు అతడిని అభినందిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్దకు వచ్చే పర్యాటకులు, యువకులు నీటిలోకి దిగవద్దని, జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.







Post a Comment