పోలీసులు లేరని నిబంధనలు పాటించకుంటే చలాన్లు
వాహనదారులారా తస్మాత్ జాగ్రత్తా!
తెలంగాణ డైలీ ప్రతినిధి, బాన్సువాడ: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు లేరని తమ వాహనాన్ని ముందుకు తీసుకెళ్తే వెంటనే మీ మొబైల్ పై ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వస్తుంది... నిబంధనలు ఉల్లంఘించినందుకు సీక్రెట్ కెమెరాలు గుర్తించి జరిమానా విధిస్తాయి....! (వీడియో 👇)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా,తాడ్కోల్ చౌరస్తా లలో పోలీసులు సిసి కెమెరాలు బిగించారు. సీసీ కెమెరాలకు జిల్లా ఎస్పీ కార్యాలయం కంట్రోల్ రూంకు అను సంధానం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారి పై ఆక్కడ నుండి పోలీసులు గమనిస్తూ ఫైన్ వేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులైతే హెల్మెట్ తప్పనిసరి ధరించాల్సిందే... ఫోర్ వీలర్స్ నడిపే వాళ్ళు బెల్ట్ పెట్టుకోవాల్సిందే... నిబంధనలు పాటించాల్సిందే... లేకపోతే కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల ముందు కూర్చున్న పోలీసులు జరిమానా విధించి ఆ సందేశాన్ని ఫోన్ కు పంపిస్తున్నారు.
అరే... సిగ్నల్ వద్ద ఎవరు లేరు గా... ఫైన్ ఎలా పడిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటినుండి అయినా తప్పనిసరిగా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలే లేకపోతే మీరు సంపాదించే దానిలో సగం అంతకంటే ఎక్కువ జరిమానాలే చెల్లించాల్సి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ప్రజలకే సురక్షితం అని ఎస్పీ చెప్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో చిన్న చిన్న పనుల నిమిత్తం పలు మార్లు సిగ్నల్స్ వద్ద నుండి జనం తిరుగుతున్నారు. రోజు ఫైన్ పడటంతో వాహనదారులకు దండిగా జరిమానాలు పడుతున్నాయి.
స్థానికులు అయోమయంలో పడుతున్నారు. సీసీ కెమెరాలు పట్టణ నడి బొడ్డున ఏర్పాటు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు జనం. అవసరం అయితే పట్టణ శివారుల్లో పెట్టాలి కానీ పట్టణ నడిబొడ్డున పెట్టడం ఎంతవరకు సమంజసం అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సీసీ కెమెరాలను పట్టణ శివారులో ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
నెలరోజుల్లో నాలుగుసార్లు ఫైన్:సాయిలు, కూలీ
"నెల కూడా కాలే... 4 సార్లు తమకు జరమానాలు పడ్డాయి... రోజుకు 4 వందలు సంపాదించేవాన్ని.... ఫైన్ కడితే ఏం మిగులుతుంది.... పోలీస్ అధికారులు స్పందించాలి... కొన్ని మినహాంపులు ఇవ్వాలి..."ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే: ఎస్పీ రాజేష్ చంద్ర
రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. బాన్స్ వాడ పట్టణంలో అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక కెమెరాలు బిగించాం. వీటిని కామారెడ్డి కంట్రోల్ రూమ్ కు అనుసంధానించాం.ఇలా ఎంతో మంది బాధితులు ఉన్నారు. పట్టణములో నుండి పరిసర ప్రాంతాల్లో బిగించాలని బాన్సువాడ ప్రజలు కోరుతున్నారు.




Post a Comment