Top News

డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను ప్రారంభించిన కలెక్టర్




టోల్ ఫ్రీ నంబర్ 9908712421
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని రూమ్ నెం. 25లో ఏర్పాటు చేసిన  డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తిన పక్షంలో ప్రజలు వెంటనే స్పందించేందుకు ఈ మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సెల్‌కు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 9908712421 ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఉన్న యెడల ప్రజలు ఈ నంబర్‌కు సంప్రదించి తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు.



ఈ మానిటరింగ్ సెల్ నేటి నుంచి జూన్ 30 వరకు పని చేస్తుందని, ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని త్రాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఇందులో ఇండస్ట్రీ ఆఫీసర్ లాలు, sc కార్పొరేషన్ వెంకటశ్వర్లు, dlpo శ్రీనివాస్, మెప్మా శ్రీధర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.



Post a Comment

Previous Post Next Post