👉48 ఓట్లతో వీగిన బిల్లు
👉326 కు 278 ఓట్లు
(తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్)
రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే 131వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి బ్రేక్ పడింది. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది.దీంతో పాటు మరో బిల్లు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, పెంపు తదితరాలకు సంబంధించిన *డీలిమిటేషన్ బిల్లుకు* కూడా సభలో ఆమోదం లభించలేదు.రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత శుక్రవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో:
- *అనుకూలంగా: 278 ఓట్లు*
- *వ్యతిరేకంగా: 211 ఓట్లు*
- *మొత్తం హాజరైనవారు: 489 మంది*
- *అబ్‌స్టెయిన్: 0* – అందరూ ఓటింగ్‌లో పాల్గొన్నారు
రాజ్యాంగ సవరణ బిల్లుకు సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. 489 మంది హాజరైతే 2/3 అంటే *326 ఓట్లు వస్తేనే బిల్లు నెగ్గాలి. కానీ అనుకూలంగా *278 మాత్రమే* వచ్చాయి. *48 ఓట్లు తక్కువ* పడ్డాయి. అందుకే వీగిపోయింది.
దీని ప్రభావం:
1. *మహిళా రిజర్వేషన్ 2029 ఎన్నికల నుండి అమలు కాదు*. మళ్లీ బిల్లు పెట్టాలి, 2/3 మెజారిటీ సంపాదించాలి.
2. *లోక్‌సభ సీట్లు 543 నుండి 850కి పెరగవు*. డీలిమిటేషన్ కూడా ఆగిపోయింది.
3. *కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు* కూడా వీగిపోయింది.
*ముగింపు:* కేంద్రం వద్ద *278 మంది* సభ్యుల బలం ఉంది. కానీ రాజ్యాంగ సవరణకు *326 మంది* కావాలి. ప్రతిపక్షం సహకరించకపోతే 2/3 రావడం కష్టం. అందుకే బిల్లు వీగిపోయింది.


Post a Comment