108 Poilet Day | బాన్సువాడలో ఘనంగా అంతర్జాతీయ పైలెట్ దినోత్సవం

బాన్సువాడలో ఘనంగా అంతర్జాతీయ పైలెట్ దినోత్సవం  

108 పైలెట్లను సన్మానించిన ప్రముఖులు  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో అంతర్జాతీయ పైలెట్ దినోత్సవాన్ని 108 సిబ్బంది ఘనంగా నిర్వహించారు. 

108 పైలెట్లకు సన్మానం  

బాన్సువాడ డివిజన్ 108 పైలెట్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అందిస్తున్న నిస్వార్థ సేవలు అమోఘమని బాన్సువాడ పట్టణ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్, ఎస్‌ఐ అశోక్ కొనియాడారు.  108 సిబ్బందికి ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్  తెలిపారు.  ఈ కార్యక్రమంలో పైలెట్లు పుండరీకం, సతీష్, శంకర్, శ్రీకాంత్, రాము, సుభాష్, రాజు, సాయిబాబా, ఈఎంటీలు రమేష్, శివ, లక్ష్మణ్, రవి, దత్తు, అఖిల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post