Inspection in Rice Shops | బియ్యం దుకాణాల్లో తనిఖీలు - రెండు కేసులు నమోదు

బియ్యం దుకాణాల్లో తనిఖీలు - రెండు కేసులు నమోదు

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు - అదనపు కలెక్టర్ విక్టర్ హెచ్చరిక

కామారెడ్డి, నవంబర్ 3:కామారెడ్డి పట్టణంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో ధరల పర్యవేక్షణ కమిటీ ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా పలు హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో బియ్యం ప్యాకెట్లపై తయారీదారు చిరునామా, వినియోగదారుల సేవా కేంద్రం ఫోన్ నంబరు ముద్రించకపోవడాన్ని గుర్తించారు. న్యాయ కొలతల శాస్త్రం (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలు-2011 లోని 6(1)(ఎ), 6(2) ప్రకారం రెండు సంస్థలపై కేసులు నమోదు చేశారు.

కేసులు నమోదైన సంస్థలు:

1. జై సంతోషిమాత కిరాణా, సుభాష్ రోడ్, కామారెడ్డి

2. లక్ష్మీ సాయి కిరాణా, జేపీఎన్ రోడ్, కామారెడ్డి

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయించరాదని, అధిక ధరలకు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ, తనిఖీలకు సహకరించాలని సూచించారు.



Post a Comment

Previous Post Next Post