తాడ్కోల్ శివారు ఎర్రమన్ను గుట్ట ఘటనలో ఏడుగురికి గాయాలు - బాధితులకు ధైర్యం
బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది - బాజిరెడ్డి గోవర్ధన్ సూచనలతో పరామర్శ
బాన్సువాడ, నవంబర్ 1: బాన్సువాడ పట్టణ సమీపంలోని తాడ్కోల్ శివారు ఎర్రమన్ను గుట్ట ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు షేక్ జుబేర్ పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచనల మేరకు షేక్ జుబేర్ బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు ధైర్యం చెబుతూ, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన సమయంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బాధితులు త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహ్మద్ ఇసాక్, అందె రాజు, బాడీ శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment