Murder Case | చౌటుప్పల్‌లో జోగిని హత్య - నిర్మల్‌లో నిందితుల అరెస్ట్

చౌటుప్పల్‌లో జోగిని హత్య - నిర్మల్‌లో నిందితుల అరెస్ట్

గంజాల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు - మధ్యప్రదేశ్‌కు పరారీ యత్నం విఫలం

1.4 కిలోల బంగారం, 3 కిలోల వెండి, ₹9 లక్షల నగదు స్వాధీనం - ఎస్పీ జానకి షర్మిల అభినందన

నిర్మల్, తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గత నెల 31న హత్యకు గురైన జోగిని రాళ్లబండి సుధాకర్ స్వామి (50) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

హత్య చేసి నగలు, నగదు దోచుకుని మధ్యప్రదేశ్‌కు పారిపోతున్న నిందితులను నిర్మల్ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ రూరల్ ఎస్ఐ లింబాద్రి తన సిబ్బందితో గంజాల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, నిందితులు తప్పించుకునే యత్నం చేశారు. సిబ్బంది చాకచక్యంగా వెంబడించి పట్టుకున్నారు.

నిందితుల నుంచి సుమారు 1.4 కిలోల బంగారం, 3 కిలోల వెండి, రూ.9 లక్షల నగదు, వారు ప్రయాణిస్తున్న టాటా హారియర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, సొత్తును యాదాద్రి భువనగిరి పోలీసులకు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.



Post a Comment

Previous Post Next Post