Dist Accreditation Committee Meeting | అర్హులైన జర్నలిస్టులకు పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు

 

కలెక్టర్ తో సమావేశంలో అక్రీడిటేషన్ కమిటీ సభ్యులు

•అర్హులైన జర్నలిస్టులకు పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు

•కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన డీఎంఏసీ భేటీ  

•జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మొదటి సమావేశం  

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్: జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో డీఎంఏసీ మొదటి సమావేశం జరిగింది.

సమావేశం ప్రారంభంలో కమిటీ సభ్యులు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి పరిచయం చేసుకున్నారు. 2026-2028 కాల వ్యవధికి సంబంధించి అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది.

252 జీ.ఓ నిబంధనలకు లోబడి అర్హత కలిగిన దరఖాస్తులకు కమిటీ సభ్యులు ఆమోదం తెలపగా, కమిటీ ఛైర్ పర్సన్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వాటిని మంజూరు చేశారు.





ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులైన జర్నలిస్టులకు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ద్వారా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ సజావుగా, పూర్తి పారదర్శకంగా జరగాలని సూచించారు.

తదుపరి వచ్చే దరఖాస్తులను కూడా ఇదే తరహాలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఎం.ఉమేష్ చంద్రరావు, ఆర్టీసీ పీ.ఓ పద్మజ, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఏ.నర్సింలు, ఆర్.భూపతి, జి.సాయి ప్రసాద్, సీ.హెచ్.జాన్సన్, ఎం.ఏ.మాజిద్, కే.రాందయానంద్, ఎండీ.గౌస్, ఎల్.బాల్ కుమార్, ఎస్.శ్రీకాంత్, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post