బాన్సువాడలో TUWJ (IJU) ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ - పర్యావరణ పరిరక్షణకు పిలుపు
బాన్సువాడ, సెప్టెంబర్ 14: పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీయూడబ్ల్యూజే ఐ అండ్ జేయూ ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, డీఎస్పీ విఠల్ రెడ్డి హాజరై భక్తులకు మట్టి గణపతులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల కాలుష్యం, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని, మట్టి గణపతులను వాడటం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని పిలుపునిచ్చారు.
ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మొత్తం 525 మట్టి గణపతులను పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సైతం మట్టి గణపతులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇజాజ్, గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు కాలెక్, నందకిషోర్, కిషన్, చంద్రశేఖర్, జర్నలిస్టులు సాయ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, పోషిరం, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





Post a Comment