Sanitation Workers Felicitated | మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

పార్క్ లో పారిశుధ్య కార్మికులను సన్మానిస్తున్న వాకింగ్ గ్రూప్ సభ్యులు

•బాన్సువాడలో మే డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
•కార్మికుల శ్రమను గుర్తించి గౌరవించడమే అసలైన మే డే : వాకింగ్ గ్రూప్

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: మే డే సందర్భంగా బాన్సువాడ పట్టణ వాకింగ్ గ్రూప్ సభ్యులు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.

వాకింగ్ గ్రూప్ అధ్యక్షుడు రుద్రంగి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. పట్టణ పరిశుభ్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ వారికి శాలువాలు కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వాకింగ్ గ్రూప్ సభ్యులు సాయన్న, బసవన్న, హన్మండ్లు, చంద్రప్ప, సోమశేఖర్, దేవి సింగ్, బీరప్ప, ఎల్ఐసీ పోచగౌడ్, డా. బసవరాజు తదితరులు పాల్గొని కార్మికులను సన్మానించారు.

కార్మికుల శ్రమను గుర్తించి గౌరవించడమే అసలైన మే డే స్ఫూర్తి అని వాకింగ్ గ్రూప్ అధ్యక్షుడు రుద్రంగి ప్రసాద్ అన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎనలేనిదని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని సభ్యులు పేర్కొన్నారు.

సన్మానం అందుకున్న కార్మికులు వాకింగ్ గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.



Post a Comment

أحدث أقدم