Electric Car | కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం

కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం  

నియంత్రణ కోల్పోయి టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన కారు  

పలు వాహనాలు ధ్వంసం, ఒకరికి తీవ్ర గాయాలు  

సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు, పోలీసుల దర్యాప్తు  



తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్:  

కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో గురువారం ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. 

అదుపుతప్పిన కారు రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలను ఢీకొట్టింది. అనంతరం వేగంగా దూసుకెళ్లి పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. 

ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పలువురు వాహనదారులు గాయపడినట్లు సమాచారం. 

ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

أحدث أقدم