ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై ఏబీవీపీ ఫైర్
అధిక ఫీజులు, అనుమతులు లేని అడ్మిషన్లపై ఆగ్రహం
"గుర్తింపు రద్దు చేయకపోతే గాడిదతో డీఈఓ ఆఫీసు ముట్టడిస్తాం" హెచ్చరిక
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి అక్రమంగా అడ్మిషన్లు చేసిన, పుస్తకాలు అమ్మిన, అధిక ఫీజులు వసూలు చేసిన, అలాగే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రైవేట్ స్కూళ్లపై ఆరోపణలు
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రాల్లోని ప్రైవేట్ పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్లు జరుపుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10 వ తరగతులకు అడ్మిషన్లు చేస్తున్నారని, క్వాలిఫైడ్ టీచర్లు లేకుండా విద్యార్థులపై కల్తీ విద్య కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
అధికారుల తీరుపై ఆగ్రహం
ప్రభుత్వ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా స్పందించక పోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్ర లేచి ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు చేసి గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డీఈఓ ఆఫీసు ముట్టడి హెచ్చరిక
లేకపోతే గాడిదతో డీఈఓ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అక్షయ్, కౌశిక్, స్వస్తిక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق