బాన్సువాడ నుంచి తిరుమలకు మహా సైకిల్ యాత్ర ప్రారంభం
మాజీ డిసిసిబి పోచారం భాస్కర్ రెడ్డి జెండా ఊపి శ్రీకారం
గురు వినయ్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తుల యాత్ర
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 25: బాన్సువాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం గురువారం మహా సైకిల్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది.
సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర ట్రస్టు ఆధ్వర్యంలో గురు వినయ్ స్వామి నేతృత్వంలో చేపట్టిన ఈ సైకిల్ యాత్రకు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జెండా ఊపి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తి, నిబద్ధత, సంకల్పం కలయికగా ప్రారంభమైన ఈ యాత్ర శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో విజయపథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. భక్తుల యాత్ర నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాలధారణ స్వాములు, నాయకులు మహ్మద్ ఏజాస్, మోహన్ నాయక్, పిట్ల శ్రీధర్, కాసోజీ నర్సన్న చారి,గోపాల్ రెడ్డి, విఠల్ రెడ్డి, సాగర్ సిందే,పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. యాత్రకు బయలుదేరిన భక్తులకు స్థానికులు మంగళహారతులు పట్టి వీడ్కోలు పలికారు.







إرسال تعليق