RTC Bus Accident | ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి, నలుగురికి గాయాలు


ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి, నలుగురికి గాయాలు

కామారెడ్డి, సెప్టెంబర్ 16: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు  ఆటోను ఢీకొనడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కామారెడ్డి నుండి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పాల్వంచ శివారులో చుక్కాపూర్ గ్రామం నుండి కామారెడ్డి వైపు వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న సుచిత్ర అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم